మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో యువకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు దర్శించికొన్నారు.ఈ సందర్బంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు.ప్రజలందరూ విఘ్నరహితంగా సుఖసంతోషాలతో జీవించాలని బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు ఆకాంక్షించారు.వినాయకుడి ఆశీస్సులు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన నగర పంచాయతీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు,బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు అభిమానులు పాల్గొన్నారు.