మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ )
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్ నగర్ మండలం లోని బొగ్గు గుడిసె వద్ద దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి.
నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయిని హరికుమార్ సంఘటన స్థలానికి వెళ్లారు.
ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటిలో కొట్టుకుపోయిన షాపులకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్ట పరిహారం అందించే విధంగా చూస్తామని అన్నారు.