మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం పాకాల గ్రామం నందు ఆత్మ ప్రకాశం జిల్లా వారి సారథ్యంలో జీవన ఎరువుల వినియోగం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ నిర్మల కుమారి మరియు మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
సహాయ వ్యవసాయ సంచాలకులు సింగరాయకొండ ఈ నిర్మల కుమారి మాట్లాడుతూ రసాయన ఎరువులకు బదులు జీవన ఎరువులు వాడడం వల్ల భూసారాన్ని పెంపొందించవచ్చని తెలియపరిచినారు.
మండల వ్యవసాయ అధికారి జీవన ఎరువులు వాడకం వలన ప్రకృతి పరంగా నేల స్వభావాన్ని మరియు సారాన్ని పెంపొందించవలసిందిగా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సైకం చంద్రశేఖర్ మరియు గ్రామ నాయకులు. వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్, గ్రామ వ్యవసాయ సహాయకులు భవాని, అరుణ్ చంద్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.