మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక శక్తి పీఠం శ్రీ సంత్ మఠ మూల మహా సంస్థానంలో ఉచితంగా మట్టి వినాయకుల వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శక్తి పీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డా,స్వామి శాంతానంద పురోహిత్
తెలిపారు. స్వామి వారి చేతుల మీదుగా వినాయకునికి తొలి పూజ నిర్వహించి, తదుపరి విచ్చేసిన భక్తులకు వినాయకులను ఉచితంగా అందజేశారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, మట్టి వినాయకులను ప్రతిష్టిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అని భక్తులకు ఉపదేశం ఇచ్చారు. ఇట్టి కార్యక్రమములో శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు దోమ సుధాకర్, నంది రాజశేఖర్, నిత్యాన్నదాన సత్రం ప్రముఖ్ బుసమోళ్ల నర్సిరెడ్డి మరియు శక్తి పీఠం ఇతర సభ్యులు,ఉద్యోగులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.