మన న్యూస్: తిరుపతి డిసెంబర్ 2, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా జన్మదిన వేడుకలను తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బిజెపి సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామి గుడిదక్షిణ మాడవీధి లోని బిజెపి కార్యాలయంలో జేపీ నడ్డా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంత మునుపు స్థానిక వినాయక సాగర్ లోని సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో జేపీ నడ్డా ఆరోగ్యంగా జీవించాలని మరిన్ని ఉన్నంతపదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు గుండాల గోపినాధ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు జేపీ నడ్డా గత ఐదేళ్లుగా బిజెపి జాతీయ అధ్యక్షులుగా పార్టీని పటిష్టంగా ముందుకు నడుపుతున్నారని కొనియాడారు. ఆయన ఏ మంత్రి పదవి నిర్వహించినా ఆ పదవికి 100% వన్నె తెచ్చే వ్యక్తిగా కీర్తి ఘటిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ బిజెపి సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ బిజెపి తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు బిజెపి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బిజెపి జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మస్తాన్ బిజెపి తూర్పు మండలం ప్రధాన కార్యదర్శి కొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బిజెపి నాయకులు రాజశేఖర్ రెడ్డి ముస్తఫా మనీ సుబ్రహ్మణ్యం సుధాకర్ రెడ్డి తదితరులు