మన ధ్యాస ,నెల్లూరు రూరల్, ఆగస్టు 25 :నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ బుజబుజనెల్లూరులోని 164వ చౌక దుకాణము నందు సోమవారం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రతి లబ్ధిదారుడు తీసుకొని, రేషన్ సరుకుల పంపిణీ విధానంలో అవకతవకలు జరగకుండా అరికట్టేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. సంవత్సర కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడండి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ కళ్ళులా సాగుతున్నాయి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో డి.ఎస్.ఓ. విజయ్ కుమార్,నెల్లూరు రూరల్ తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, సివిల్ సప్లయిస్ డి.టి.జమీర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, స్థానిక కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి, కో క్లస్టర్ ఇంచార్జ్ పిగలం నరేష్, 25వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు శేషు యాదవ్, టిడిపి నాయకులు మాతంగి కృష్ణ, బ్రహ్మారెడ్డి, నాగళ్ళ రాము,హరి నాయుడు, దొడ్డక రమేష్, బాలకృష్ణ యాదవ్, రాజగోపాల్, కరిముల్లా, దూడల ప్రసాద్, కృష్ణయ్య, సి.హెచ్. మహేంద్ర, కృష్ణ, ముజీర్, రాజా, మాబాష, సోనయాని, బిజెపి నాయకులు వెంకటరావు, రాజా,జనసేన నాయకులు కుడుముల సురేష్ తదితరులు పాల్గొన్నారు.