మన ధ్యాస, నారయణ పేట జిల్లా : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను కళాశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. 2025 26 మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులు ఘనంగా ఆహ్వానం పలుకుతూ కళాశాల గురించి వివరిస్తూ కళాశాల అందిస్తున్న సదుపాయాలను అధ్యాపక బృందం పనితీరును కొనియాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థుల ఉద్దేశించి ప్రసంగిస్తూ,విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్, అధ్యాపకులు హరిచంద్ర, తిరుపతి, నర్సోజి, జాంగీర్, రమేష్ గౌడ్, మహేష్, బాలరాజ్, లింగప్ప, లక్ష్మి కాంత్ రెడ్డి, సులోచన, రాజేశ్వరి, నాగేంద్రమ్మ, ప్రదీప్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.