మన ధ్యాస, నారయణ పేట జిల్లా : సోమవారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజామున 5 గంటల సమయంలో కొండాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాల చౌరస్తా దగ్గర TS 12 UC 4986 నెంబర్ గల టిప్పర్ అడ్డు రాగా ధన్వాడ పోలీస్ సిబ్బంది పీ సీ తిరుమలేష్ గౌడ్ మరియు హెచ్ జీ తిరుపతిరెడ్డి అట్టి టిప్పర్ ని ఆపి తనిఖీ చేయగా ఇసుకతో నింపబడి ఉన్న కారణంగా అట్టి టిప్పర్ డ్రైవర్ ను ఇసుకను తరలించడానికి ఏమైనా ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడగగా, అతని దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు లేవు అని తెలిపినాడు, ఇట్టి ఇసుకను కోయిలకొండ వాగు నుంచి అక్రమంగా నింపుకొని ఎక్కువ ధరకు ధన్వాడ మండల పరిధిలో అమ్ముటకు వచ్చినాను అని తెలిపినాడు. అట్టి డ్రైవర్ ను మరియు ఇసుక టిప్పర్ ను ధన్వాడ పోలీస్ స్టేషన్ కి తరలించి డ్రైవర్,పసుల నారాయణ s/o చెన్నప్ప, ఓనర్ :- ప్రభాకర్ s/o తిరుమలయ్య ల పై కేసు నమోదు చేయడం జరిగింది అని ఎస్ఐ తెలిపారు. ధన్వాడ మండల పరిధిలో పర్మిషన్ లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతదని ఎస్ఐ హెచ్చరించారు.