వింజమూరు మన న్యూస్ ప్రతినిధి ఆగస్టు 25 :///
కలిగిరి మండలం కుడుములదిన్నె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా భాసం నరసింహనాయుడు నూతనంగా ఎంపికయ్యారు. ఆ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట సొసైటీ డైరెక్టర్లు గా ఎంపికైన డబ్బుగుంట మాలకొండయ్య,(బుజ్జయ్య), మార్తుల మాలకొoడా రెడ్డి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు, కలిగిరి మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, సీమల తాతయ్య, రావుల కొల్ల సర్పంచ్ పూసల వెంకప నాయుడు, ఏపీనాపి సర్పంచ్ వరప్రసాద్, తెల్లపాడు మాజీ సర్పంచ్ సుబ్బారావు,గన్నమనేని శ్రీనివాసులు, రోడ్డా మహేష్,పెద్దకొండూరు మాజీ సర్పంచ్ మొక్కా హాజరాత్ రావు,తదితరులు ఉన్నారు..