మన ధ్యాస, నారాయణ పేట జిల్లా : మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిని నగర్, ఎల్బీ కాలనీ, ఆనంపల్లి వీధి, శ్రీరాం నగర్, ఆజాద్ నగర్ కాలనీవాసులు, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక డెయిరీ క్రీడా యువజన మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,గతంలో పట్టణ శివారులోని తిరుమలయ్య చెరువులో ఖననం చేసే వారమని, అయితే చెరువు పూర్తిగా నిండి ఉండటం, స్థలాభావ సమస్యల కారణంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మరోచోట స్మశానానికి స్థలం కేటాయించాలని కోరారు. స్పంందించిన మంత్రి సాధ్యమైనంత త్వరగా స్మశాన వాటిక సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వల్లంపల్లి లక్ష్మణ్, శాలంబిన్ ఉమర్, ఎ.రవి కుమార్, బోయ వెంకటేష్, టీ వీ 9 వెంకటేష్ ,బోయ నరసింహ, మీస్కిన్ నాగరాజ్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.