మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 24 :*వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసిన దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, కొండ్లపూడి వైసీపీ నాయకులు అల్లం సునీల్ యాదవ్.*వందలాదిమంది కార్యకర్తలతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి అశోక్ రెడ్డి మరియు అల్లం సునీల్ యాదవ్. *స్వాగతించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జనంతో కిటకిటలాడిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం. *నెల్లూరు రూరల్ లో రోజురోజుకు బలహీనపడి, ఉనికి కోల్పోతున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి అశోక్ రెడ్డి మరియు అల్లం సునీల్ యాదవ్ వారి మిత్రబృందం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనరంజక పాలనలో అందరం కలసి పనిచేద్దాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 గ్రామాల సర్పంచ్ లు, 12 ఎంపీటీసీ లు, 1 జడ్పీటీసీ, 26 డివిజన్ల కార్పొరేటర్లను 100 కి 100 శాతం కూటమి ప్రభుత్వం గెలిచి తీరుతుంది అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ అల్లాబక్షు, టిడిపి మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్,కోక్లస్టర్ ఇంచార్జ్ రాపూరు శేఖర్, టిడిపి నాయకులు కుర్ర పద్మాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ముత్యంశెట్టి శీనయ్య, వెంకటేశ్వర్లు, టి.వెంకటేష్, విజయ్ కుమార్, అశోక్, పుల్లారెడ్డి, గంధం మహేష్, రవి, నరసింహారెడ్డి, వెంకటరమణ, ఇంద్ర, శీను, ప్రవీణ్, మహేష్, రమేష్, వెంకటేశ్వర్లు, సుధాకర్, రామయ్య, సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.