మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంకు వెళ్ళే రహదారి అధ్వానంగా మారి రోడ్డు పైన ప్రయాణించ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై సింగరాయకొండ మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోల బాల వీర ఆంజనేయ స్వామి గారి తూర్పు నాయుడుపాలెం తన క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేసారు. మంత్రి వర్యులు వీలైన త్వరలో నూతన రహదారి నిర్మించడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి తగరం రాజు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.