శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:-బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారుల స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గునపర్తి అపురూప్ ద్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ల బావి సమస్య పై శనివారం గ్రామంలో పర్యటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం (సుబ్బు బాయ్), కాకినాడ జిల్లా జనరల్ సెక్రెటరీ కండవల్లి లోవరాజు, కాకినాడ జిల్లా ఇంచార్జ్, తుని నియోజకవర్గ ఇన్చార్జ్, తంతట కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల నుండి అక్కడ చెరువు నీరు లో ప్రక్కన పొలాల నుండి కెమికల్ కలిసిన నీరు చెరువులోకి చేరడంతో చెరువు ని ఆనుకొని ఉన్న మంచినీరు బావి కలుషితం అవడంతో గ్రామంలో గల యువత మండల అధికారులకు గ్రామ నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎవరు స్పందించకపోవడంతో రాస్తారోక చేపట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని, సంఘటన స్థలానికి రౌతులపూడి సబ్ ఇన్స్పెక్టర్ చేరుకొని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం సమస్యను పరిష్కరించకపోవడంతో పాటు అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోలేదని ఎక్కడ గొంగళి అక్కడే అంటూ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. బలరాంపురం గ్రామ ప్రజల పిలుపుమేరకు గ్రామ ప్రజలకు బీఎస్పీ పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. తక్షణమే స్పందించి అధికారులు నాయకులు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే సమస్యను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా దళిత ఉద్యమ నాయకురాలు కొంకి పూడి రాజ్యలక్ష్మి, దయ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ బత్తిన తాతాజీ, కమల్ శ్రీరామ్, పండు, బీఎస్పీ కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామ యువత పాల్గొన్నారు.