మన న్యూస్ ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంవద్ద స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం చేపట్టారు.ఈ సమావేశంలో ఏలేశ్వరం మండలంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సూచనల మేరకు ఏలేశ్వరం మండలం మాజీ జడ్పిటిసి జ్యోతుల వీరస్వామి పెదబాబును ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రకటించారు.మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు జ్యోతుల పెదబాబు కు ఎమ్మెల్యే సత్యప్రభకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జ్యోతుల పెదబాబు మాట్లాడుతూ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు,కార్యకర్తలు కు వెన్నంటే ఉంటానని,ఏలేశ్వరం మండల తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.