మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.సబ్ కలెక్టర్ విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు, బోధన విధానం గురించి ఉపాధ్యాయుడు మధుసూదన్ రాజుతో చర్చించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మార్గనిర్దేశం చేశారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన ఆమె, మెనూ ప్రకారం భోజనం అందించాల్సిందిగా ఏజెన్సీ నిర్వాహకురాలినిఆదేశించారు.
మొహమ్మద్ నగర్ సింగీతం ప్రాజెక్టు వద్ద 765 రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.పంట పొలాల గుండా రోడ్డు వెళ్తున్న విషయాన్ని గమనించి, రైతులకు నష్టపరిహారం అందే విధంగా చూడడం జరుగుతుందన్నారు.ఎంతవరకు సర్వే పూర్తయిందీ,ఎంత భూభాగంలో వెళ్తుందీ వంటి వివరాలను సేకరించి తక్షణమే తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఒక రైతుకు పంట ఏ విధంగా మీకు వచ్చిందని రైతుకు నోటీసు ఇవ్వమని తహసీల్దార్ కు సబ్ కలెక్టర్ సూచించారు.ఈ సందర్శనలో తహసిల్దార్ సవైయి సింగ్, డిప్యూటీ తహసిల్దార్ క్రాంతి కుమార్, ఆర్ఐ పండరి తదితరులు పాల్గొన్నారు.