- ప్రథమ స్థానంలో జలవనుల శాఖ మంత్రి రామానాయుడు.
- చివరి స్థానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ, మన న్యూస్: ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకులు కేటాయించారు.మొదటి స్థానంలో మంత్రి రామానాయుడు, చివరి స్థానాల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు.
జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత నాలుగో స్థానంలో హోం మంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. చివరి స్థానాల్లో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు.