మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో శనివారం స్థానిక పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేపట్టినట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. లయన్ శరణప్ప మనుమరాలు, గీతా అంబ్రెష్ ల కూతురు శ్రీనిక మొదటి పుట్టినరోజు పురస్కరించుకొని ఆలయ ఆవరణలో సుమారు 350 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు సత్య ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ ప్రసాద్, కోశాధికారి ఆడెం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మామిళ్ల పృథ్వీరాజ్, సీనియర్ సభ్యులు డాక్టర్ శ్రీరామ్, ఎ.రవి కుమార్, కోళ్ల వెంకటేష్, కర్ని స్వామి, సుకన్య శేఖర్, కట్టా వెంకటేష్, పాపిరెడ్డి, రవికుమార్ గౌడ్, వాకిటి రమేష్, రాజేష్ గౌడ్, స్థానికులు గూడూరు అజయ్ , తదితరులు పాల్గొన్నారు.