మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో కోతుల బెడద అధిక మయ్యింది. ఇప్పటి వరకు గ్రామంలో చాలా మందికి కోతులు కాటేశాయి.తలుపులు కిటికీల గుండా ఇళ్లలో చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లు తున్నాయి.గుంపులు గుంపులుగా గ్రామంలో తిరుగుతు ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్ల పై ఎక్కి పై కప్పును తీసేస్తున్నాయి.ఎన్ని సార్లు పై కప్పును మరమ్మతులు చేపట్టిన కోతులు ఇళ్ల కూన తీసివేయడంతో వర్షాకాలంలో ఇళ్లు ఉరు స్తున్నాయి.చాలా ఇల్లు ఉరుస్తుండటంతో గోడలు నాని కూలిపోయే స్థితికి చేరుకున్నాయి.గతకొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అయిదు ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి.
శుక్రవారం వాకింగ్ వెళ్ళిన సింగిల్ విండో వైస్ చైర్మన్ గంగా గౌడ్ ను పాఠశాల సమీపంలో కోతులు తీవ్రంగా కాటేశాయి. ఆయన పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి భూపల్లి ప్రదీప్,స్థానిక ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ డాక్టర్ సాయిబాబా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్, ఏఎన్ ఎం లక్ష్మీ,వైస్ చైర్మన్ ను పరామర్శించారు.డాక్టర్ ఆయనకు ఆరోగ్య సలహాలు అందించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అటవీ అధికారి రవికి ఫోన్ చేసి గ్రామంలో కోతుల బెడద గురించి వివరించారు.గ్రామం నుండి కోతులు పారద్రోలలని కోరారు.