మన న్యూస్: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవాని పేట గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో గ్రామంలోని రైతులందరూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు కిసాన్ సన్ గ్రామ అధ్యక్షులు నా రెడ్డి వెంకట్ రెడ్డి, కార్యదర్శి గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఇచ్చినటువంటి హామీని రెండు లక్షల రూపాయల హమిని పూర్తిగా అమలు చేయడం లేదని ఇచ్చిన హామీని రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని అదేవిధంగా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగిందిని తెలిపారు ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూడకుండా రుణమాఫీ కానీ రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కిసాన్ సంగ్ రైతులు పాల్గొన్నారు.