మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రిన్సిపల్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉచితర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా 2025 నేషనల్ వర్క్ షాప్ ను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జాతీయ స్థాయి నుండి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు రిసోర్స్ పర్సన్స్ గాహాజరయ్యారు.జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఆన్లైన్ లో ఈ సమావేశంలో హాజరై విద్యార్ధులకు అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.కీనోట్ స్పీకర్గా ప్రొఫెసర్ బల్ల అప్పారావు రిటైర్డ్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం హాజరై జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు, నైపుణ్య శిక్షణ విషయాల్లో ప్రభుత్వ సహాయ సహకారాలు వంటి అంశాలను విద్యార్థులతో చర్చించారు. వీరితోపాటు డా. అలోక్ కుమార్ న్యూ ఢిల్లీ , ప్రొఫెసర్ వరప్రసాద్ విశాఖపట్నం, అనంతరావు మహారాష్ట్ర, అనిరుద్ సిస్ట్ల కాకినాడ, హాజరై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవస్థాపకులుగా ఏవిధంగా ఏదగాలి అనే విషయాలపై విశదీకరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి వాటికి పదును పెట్టి వ్యాపార రంగం లో అడుగు పెట్టి తద్వారా విజయాలను సాధించాలని, బ్యాంకింగ్ రంగం అందిస్తున్న సహాయ సహకారాలను అందుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. వ్యాపార పెట్టుబడుకు పేదరికం అడ్డం కాకూడదని తన ఆలోచనలు అమలు చేయడానికి బ్యాంకింగ్, ప్రభుత్వ రంగాల నుండి సహాయ సహకారాలు, సంబంధిత పథకాల గురించి తెలియజేశారు. ఆన్లైన్, ఆఫ్ లైన్ పద్ధతిలో జరిగిన ఈ వర్క్ షాప్ కు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పి జి కళాశాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ స్టార్టప్ అనే అంశంపై జరిగిన పోస్టర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్ కు అనేకమంది విద్యార్థులు తమ పోస్టర్స్ ను సమర్పించడం జరిగింది. ఈ కాంపిటీషన్లో ప్రథమ బహుమతి 5000 రూపాయలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం విద్యార్థులు సత్య భార్గవి, పరిమళ కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతి 3000 రూపాయలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జగ్గంపేట విద్యార్థులు తృతీయ బహుమతి 2000 రూపాయలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల తుని విద్యార్థులు వైష్ణవి కైవసం చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. డి చెన్నారావు హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ కళాశాలకు సంబంధించిన అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం వర్క్ షాప్ కన్వీనర్ లు డా. ప్రయాగ మూర్తి ప్రగడ,సురేష్, ఆర్గనైజర్లు వెంకటేశ్వర రావు,రామారావు, సభ్యులు డా. మదిన సాహెబ్ షేక్, డా.శివ ప్రసాద్, శ్రీలక్ష్మి,వీర భద్రరావు,బంగారాజు,కుమారి మేరీ రోసిలిన, పుష్ప, సతీష్ ప్రసాద్,రాజేష్. మరియు అద్యాపకేతర సిబ్బంది సత్యనారాయణ,వై ధర్మరాజు దివ్య, కమల,రామలక్ష్మి,కళావతి, పైడమ్మ హాజరయ్యారు.