మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ప్రజా ప్రభుత్వం పనుల జాతర' కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జు తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంత ప్రారంభోత్సవానికి భూమి పూజ చేసి,పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, మండల ప్రత్యేక అధికారిని ప్రేమల, ఎంపీడీవో గంగాధర్, మండల విద్యాధికారి తిరుపతి, ఏపీ శివకుమార్ ,పాఠశాలప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.