మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా సహకారంతో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మ కుమారీస్ మెగా రక్తదాన శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. రాజయోగిణి ప్రకాశమణి దాదీ 18వ పుణ్య తిథి సందర్భంగా విశ్వ బంధుత్వ దినోత్సవం పేరిట లయన్స్ క్లబ్ మక్తల్ భీమా సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం లో దాదాపు వంద యూనిట్లు రక్తం సేకరించినట్లు బ్రహ్మ కుమారీస్ సంతోషి దీదీ తెలిపారు. భారతదేశంలో రక్త కొరత తీవ్రంగా ఉందని, ఇండియా, నేపాల్ కలిపి ఒకేరోజు లక్ష యూనిట్ల రక్తం సేకరిఃచడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మక్తల్ సెక్రటరీ అంజన్ ప్రసాద్, కోశాధికారి ఆడెం సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మామిళ్ల పృథ్వీరాజ్, జోన్ చైర్మన్ సూగురు జైపాల్ రెడ్డి, సీనియర్ సభ్యులు డాక్టర్ శ్రీరామ్, ఎ.రవి కుమార్, కోళ్ల వెంకటేష్, గవినోళ్ల జైపాల్ రెడ్డి, కట్టా వెంకటేష్, సాయి జ్యోతి వెంకటయ్య, డాక్టర్ రాజేష్ గౌడ్, వాకిటి రమేష్, భార్గవ్ రాణా, నాయకులు రాయికోడ్ ఆనంద్, పోగుల కిష్టప్ప, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.