-పాలకమండలి చైర్మన్ బరిలో మహిళా బిజెపి నేత. సౌభాగ్య శ్రీరామ్
ఉరవకొండ, మన న్యూస్: సుప్ర సిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్హోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలి చైర్మన్ బరిలో జిల్లా బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరాం ఉన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలో ఆమె ఉన్నారు. ఆమె చురకైన కార్యకర్త నుంచి జిల్లాస్థాయి నాయకురాలుగా అంచలంచలుగా ఎదిగారు. సామాజిక స్పృహ, మంచి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ కీలక భూమిక పోషించారు. తాజాగా గురువారం దేవస్థానంలో బిజెపి నేతలు సంధి రెడ్డి నారాయణస్వామి, దగ్గుపాటి శ్రీరామ్, దేవేంద్ర పలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాలకమండలి చైర్మన్ దరఖాస్తును తీసుకొని నింపారు. పాలకమండలి చైర్మన్ బరిలో శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీమతి సౌభాగ్య శ్రీరామ్ మాట్లాడుతూ తాను చైర్మన్గా ఎంపిక అయితే దేవస్థానాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. రతనిర్మాణ చొరవ తీసుకుంటామన్నారు. సాలగ్రామ ఏర్పాటు భక్తుల వసతిగృహాల ఏర్పాటు చేసి పెన్నహోబిలంలో జింకల ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెన్నహోబిలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సంస్కృతి సంప్రదాయాలకు భక్తులు పెద్దపీట వేసి కార్మికులను నియమించాలని బిజెపి నేతలు దేవస్థాన ఉన్నతాధికారులను కోరారు.
- ఇది ఇలా ఉండగా పాలకమండలి చైర్మన్ అధ్యక్ష స్థానం కోసం రాంపల్లి గ్రామానికి చెందిన రేగటి నాగరాజు టిడిపి నాయకులతో కలిసి దరఖాస్తు దాఖలు చేసుకున్నారు.
- ఇప్పటికీ పాలకమండలి చైర్మన్ పోటీలో ఓసి ఒక మహిళ , ఒక బీసీ నాయకుడు బరిలో ఉన్నారు