మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంకి చెందిన కుమ్మరి వెంకటేశ్వర్లు, తన్నీరు రమణయ్యల సహకారంతో ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు నాలుగు లక్షల విలువైన వెయ్యి జతల దుస్తులను మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాంబాబు మాట్లాడుతూ మండలంలో గవదగట్లవారిపాలెం, మల్లికార్జున నగర్, పకీరుపాలెం, బింగినపల్లి ఎస్సీ, సోమరాజు పల్లి, పెద్ద గొల్లపాలెం, అప్పాపురం జిపిఎస్, తాతయ్య కాలనీ,బాలిరెడ్డి నగర్,బాలయోగి నగర్,ఎంపీపీస్ ఆర్.ఎస్ మొదలైన పాఠశాలలకు మరియు ఒంగోలు డివిజన్ లోని 15 సమరసత సేవా ఫౌండేషన్ బాల వికాస కేంద్రాల విద్యార్థులకు దుస్తులు అందజేసినట్లు, మరికొన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా అందజేయనున్నట్లు తెలియజేశారు. సమాజంలోని పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో, దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల కమిటీ చైర్మన్ లు పాల్గొని దాతలను ఘనంగా సన్మానించారు.