
మన ధ్యాస తవణంపల్లి ఆగస్టు-21: జానపద దినోత్సవం సందర్భంగా జానపద పాటల మాసొస్తవ కార్యక్రమంలో భాగంగా మనసంస్కృతి కళా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జానపద పాటల పైన అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జానపద పాటల పైన మన సంస్కృతి కళా సంస్థ ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప జానపద పాటల పైన కళల రూపంలో విద్యార్థులను చైతన్య పరచడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు జానపద కళల పైన అభిరుచులు కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం జానపదాలు పైన మండల జిల్లా రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కళలు పైన ప్రతి ఒక్కరు ఆసక్తి కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ జానపద పాటలు కళలను ప్రోత్సహించాలని, ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయని, ఇలాంటి సంస్కృతి వాతావరణాన్ని విద్యార్థులు తెలుసుకొని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జానపద ప్రదర్శన కళలకు తెలుగు భూమి పండిన పంట పొలం వంటిదని శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపదలేనని తెలిపారు. అనంతరం తవణంపల్లి ఎన్జీవో అనంత కుమార్ మాట్లాడుతూ పల్లెటూరు వారు పాడుకునే పాటలు జానపద గీతాలని నేటికీ ఇవి అంతరించిపోకుండా ఈ కళలను కాపాడుకునే బాధ్యత సమాజం పైన విద్యార్థుల పైన అందరి పైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు పూల మనోహర్, పూసల నరసింహులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.