మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-21
వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని తవణంపల్లె ఎస్ ఐ చిరంజీవి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు ప్రతి గ్రామములోని నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఇంతకుముందులా మీ సేవకు వెళ్లి అనుమతులు పొందే అవసరం లేదని నేరుగా తమ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ నుంచే అనుమతులు పొందవచ్చని తెలిపారు
గణేష్ ఉత్సవ్ డాట్ నెట్' వెబ్సైట్ లో పూర్తి వివరాలను పొందుపరిచి పోలీస్ అనుమతులు సులభంగా పొందవచ్చు అని తెలిపారు.
వినాయక చవితి వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. చవితి వేడుకల నిర్వాహకులు తక్షణమే ఆన్లైన్లో రిజిస్టర్ అయ్యి అనుమతులు తీసుకోవాలని సూచించారు. పోలీసు నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.