మన న్యూస్ యాదమరి ఆగస్ట్-20
పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, బుడితిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఖాదర్బాషా కుటుంబాన్ని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్య బారినపడి ఖాదర్ బాషా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న *"పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్"* బుధవారం యాదమరి మండల నాయకులతో కలిసి ఖాదర్బాషా నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. ఖాదర్ బాషా నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త అని, ఆయన లేని లోటు పార్టీకి, గ్రామానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఖాదర్ భాషా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రబ్బీ, చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి అమర్నాథ్ నాయుడు, సింగల్ విండో డైరెక్టర్ మహబూబ్ బాషా మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.