నెల్లూరు మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్ట్ 20 :///
రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రివర్యులు నశ్యం మొహమ్మద్ ఫరూక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తాడేపల్లి లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిరువురూ వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ముస్లిం లకు సంక్షేమ కార్యక్రమాలపై సవివరంగా చర్చించారు. వక్ఫ్ ఆస్తులు ముస్లిం ల సమాజ భవిష్యత్తుకు మూలస్తంభాలని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజ ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముస్లిం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ల ఏర్పాటు ప్రణాళికపై విస్తృతంగా చర్చించారు. మహిళలకు వృత్తి ఆధారిత శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అబ్దుల్ అజీజ్ తెలిపారు. ముస్లిం విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, నూతన విద్య పథకాన్ని తీసుకువచ్చి వారిలో సమర్థత ను పెంచాలని సూచించారు. అన్నిటికి సానుకూలంగా స్పందించిన మంత్రి ఫరూక్ వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి కోసం, ముస్లిం ల సంక్షేమం కోసం అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డ్ భవిష్యత్తు, మైనారిటీల కు విద్యా ఉపాధి రంగాల్లో అవకాశాలు సృష్టించే దిశగా ముందుకు సాగుదామని భరోసా కల్పించారు.