మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20 తవణంపల్లి మండల రైతు సేవ కేంద్రాలలో రైతులకు జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ అద్వర్యం లో గ్రామసభ నిర్వహించడం జరిగింది. టీ పుత్తూరు మరియు పుణ్య సముద్రం రైతు సేవ కేంద్రాల ద్వారా
గుజ్జు పరిశ్రమకు మామిడి కాయలు తొలిన రైతుల జాబితా పరిశీలన కొరకు గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ తహసిల్దార్ సుధాకర్ పాల్గొని ఈ సందర్భంగా రైతుల జాబితాను రైతుల ముందు చదివి వినిపించడం జరిగింది. రైతులు ఈప్పటికైనా ఏవైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దు కోవాలని కాటా, బ్యాంకుపేరు, బ్యాంకు ఖాతా నెంబర్, బాంక్ ఐ.ఎఫ్.ఎస్.సి సంఖ్య ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి, ఇంకా 2 రోజుల రైతుసేవా కేంద్రాల నందు జాబితా ఉంటుంది అని అందరూ రైతులు సరిచూసుకోవాలి. ఏదైనా తప్పులు ఉంటే సరిచేస్తామని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీ పుత్తూరు సర్పంచ్ రవి రెడ్డి పుణ్యసముద్రం సర్పంచ్, రెవెన్యూ సిబ్బంది మరియు రైతుసేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.