మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20 చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పొగాకు నియంత్రణలో భాగంగా జులై 1 నుండి జులై 21 వరకు అత్యధిక సంఖ్యలో సంతకాలు సేకరించిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారిణి హేమలత పాఠశాల బ్యాగులు పంపిణీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 7, 8,9 తరగతుల విద్యార్థులకు పొగాకు వ్యతిరేక సంతకాల సేకరణ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ విద్యార్థులు పొగాకు వ్యతిరేక సంతకాల సేకరణ, పొగాకు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రతిజ్ఞను ప్రజలకు తెలియచేసి సంతకాలు సేకరించారు. సేకరించిన సంతకాలను పరిశీలించి ఎవరైతే ఎక్కువ సంతకాలు సేకరించారో ప్రతి మండలం నుండి మొదట వచ్చిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో మొదటి బహుమతి కె మోనిత్ సాయి ఆచారి 7వ తరగతి, రెండవ బహుమతి టి మహేందర్ 8 వ తరగతి జడ్పీ హైస్కూల్ తొడతర, మూడవ బహుమతి ఈ పి. సాహిత్ కుమార్ రెడ్డి 9 వ తరగతి జడ్పీ హైస్కూల్ తవణంపల్లి వీరికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సమకూర్చిన పాఠశాల బ్యాగులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిణి, హేమలత పాఠశాల ఉపాధ్యాయులు సిపి సుధాకర్ రెడ్డి, ఆర్ లవన్ కుమార్ రెడ్డి, సిఆర్ఎంటి గోపి, వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న పొగాకు నియంత్రణ సామాజిక కార్యకర్తలు టి. లావణ్య, బి. శిల్ప పాల్గొన్నారు.