మన, న్యూస్ నారాయణ పేట జిల్లా : బుదవారం రోజు ధన్వాడలోని జడ్ పీ హేచ్ ఎస్ పాఠశాలలో షి టీమ్ పోలీసులు విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ర్యాగింగ్ ఈవ్ టీజింగ్, చదువుపై శ్రద్ధ, గోల్ సెట్టింగ్, క్రమశిక్షణ, టైం మేనేజ్మెంట్, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొదలగు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం పోలీసులు బాలరాజు, కవిత, జ్యోతి లు మాట్లాడుతూ,విద్యార్థులు చదువుపై దృష్టి సారించి బాగా చదువుకోవాలని, చిన్నప్పటినుండి ఒక గోల్ ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగానే కష్టపడి బాగా చదవాలని క్లాసులో విద్యార్థుల మధ్య చదువులో పోటీ తత్యం కలిగి ఉండాలని, మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని సూచించారు. ఎవరైనా విద్యార్థినీలను వేధిస్తే షి టీమ్ నెం. 87126 70398 కల్ చేసి ధైర్యంగా తెలపాలని చెప్పారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి నుండి స్కూల్ కి వచ్చే పోయే సమయంలో ఎవరైనా వేధించిన, ఎవరి పైన అయినా అనుమానం ఉంటే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీం పోలీసులు జ్యోతి, కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.