మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలియజేశారు.ఎస్సైగా పదోన్నతి పొందిన ఆంజనేయులు ను అభినందించారు. బుధవారం రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.పదోన్నతి పొందిన ఆంజనేయులుకు ఎస్ ఐ గా రెండు స్టార్ లను అలంకరించి అభినందనలు తెలియజేసారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కోస్గి పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తూన్న ఆంజనేయులు ఎస్ ఐ గా పదోన్నతి పొందడం జరిగిందన్నారు.పదోన్నతి ఉత్సాహంతో పాటు మరింత బాధ్యత పెంచుతుందని అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసుల పట్ల భరోసా, నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని తెలియజేశారు. ఎస్ ఐ గా పదోన్నతి పొందిన ఆంజనేయులుని కోస్గి పోలీస్ స్టేషన్ ఎస్సై 2 గా బదిలీ చేయడం జరిగిందన్నారు.