*జలదంకి మండలం అన్నవరంలోని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు. *వైసీపీ రౌడీ మూకలని పట్టుకుని పోలీసులకి అప్పగించిన క్రషర్ సిబ్బంది.*మారణాయుధాలు స్వాధీనం చేసుకుని, నిందితులని అదుపులోకి తీసుకున్న పోలీసులు.*కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి *ప్రోత్సాహం తో దాడి కి పాల్పడినట్లు చెబుతున్న రౌడీమూక.*డ్రోన్ తో వీజువల్స్ తీస్తుండగా ప్రశ్నించిన సిబ్బందిపై మారణాయుధాలతో దాడికి యత్నం.*వీడియోలు తీసుకురండి, అడ్డొస్తే ఏమైనా చేయండని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆదేశించినట్టు చెబుతున్న నిందితులు. * నిందితులకి ఫోన్లు చేస్తూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పర్యవేక్షణ. *కావలి లో వేడెక్కిన రాజకీయాలు.*ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి మధ్య వార్.*నన్ను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్లాన్:ఎమ్మెల్యే*రామిరెడ్డి తాటాకు చప్పుళ్ళుకు భయపడేది లేదు :ఎమ్మెల్యే.*రామిరెడ్డి ఖబడ్డార్ అంటూ వార్నింగ్ ఇచ్చినకావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి.*నన్ను హత్య చేసేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు.. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మన న్యూస్, కావలి ,ఆగస్టు 19: నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం,జలదంకి మండలం అన్నవరంలోని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి చెందిన క్రషర్ వద్ద వైసీపీరౌడీ మూకలు రెచ్చిపోయారు. డ్రోన్‌తో వీజువల్స్ తీస్తుండగా ప్రశ్నించిన సిబ్బందిపై మారణాయుధాలతో దాడికి యత్నించారు. వైసీపీ రౌడీ మూకలని పట్టుకుని పోలీసులకి అప్పగించారు క్రషర్ సిబ్బంది. మారణాయుధాలు స్వాధీనం చేసుకుని, నిందితులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీడియోలు తీసుకురండి, అడ్డువస్తే ఏమైనా చేయండని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ఆదేశించినట్లు నిందితులు చెబుతున్నారు. నిందితులకి ఫోన్లు చేస్తూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి పర్యవేక్షిస్తున్నారని నిందితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డికి క్రషర్ సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే కావ్యా కృష్ణారెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు.మారణాయుధాలతో క్రషర్ వద్దకు వచ్చారు అని ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి అన్నారు.అయితే, ఈ ఘటనపై కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి మాట్లాడుతూ...... వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో తనను చంపేందుకు రెక్కీ చేశారని పేర్కొన్నారు. తాను ఈరోజు మామిడి తోటలోకి వస్తానని వాళ్లకు తెలుసునని చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో తాను సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. అక్కడ ఉంటాననే తన క్రషర్, తోట లో డ్రోన్లతో వెతికారని వివరించారు. తమ వాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే వారి పైనే దాడి చేశారని మండిపడ్డారు. అందరూ కలిసి పట్టుకుని ప్రశ్నిస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి పంపినట్లు చెప్పారని అన్నారు. అతను చేసే ఆగడాలను ప్రశ్నించానని తనపై కక్ష పెంచుకున్నారని చెప్పుకొచ్చారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి కూడా వాళ్లకు ఫోన్లు వచ్చాయని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు.ప్రతాప్‌రెడ్డి జగన్ కు సన్నిహితుడని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ ఆదేశాలతోనే నేడు తనను చంపడానికి కుట్ర చేశారనే అనుమానం కలుగుతుందని తెలిపారు. నిందితుల వద్ద ఫోన్లకు ప్రతాప్‌తో పాటు, పలువురు వైసీపీ నేతలు కాల్స్ చేశారని చెప్పుకొచ్చారు. వారు తెచ్చిన కత్తులు, వాహనం కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించామని వివరించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఓటమితో డైవర్షన్ పాలిటిక్స్‌కు జగన్ తెర లేపారని ధ్వజమెత్తారు. తనను లక్ష్యం చేసుకుని చంపాలని ఈరోజు ప్లాన్ వేశారని తెలిపారు. పోలీసులకు అన్ని ఆధారాలు, అనుమానితుల పేర్లు కూడా చెప్పామని అన్నారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తన హత్యకు కుట్రలు చేసిన వారి వివరాలను సీఎం చంద్రబాబును కలిసి అందచేస్తానని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి పేర్కొన్నారు.