*అన్నదాత సుఖీభవతో రైతుల్లో రెట్టింపు సంతోషం.*తల్లికి వందనంతో ఇంటింటా ఆనందం.*మహిళల్లో ఊహించని స్థాయిలో సంతోషాన్ని నింపుతున్న స్త్రీశక్తి.*ఈ పథకాలన్నీ చూశాకే పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం.*ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూపకపోగా వాస్తవాలను వక్రీకరించే పనిలో బ్లూ మీడియా.*అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీని 900 ట్రాక్టర్లతో రికార్డు స్థాయిలో సక్సెస్ చేసిన సర్వేపల్లి నియోజకవర్గ రైతులకు ప్రత్యేక ధన్యవాదములు. *వెంకటాచలంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ విజయోత్సవ ర్యాలీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*అంచనాలకు మించి వచ్చిన వందలాది రైతు రథాలు(ట్రాక్టర్లు), రైతులతో కలిసి వెంకటాచలం ఇసుక డంపింగ్ యార్డు నుంచి ఎర్రగుంట సమీపంలోని కమ్యూనిటీ హాలు వరకు ర్యాలీ. *వందలాది ట్రాక్టర్లతో జాతీయ రహదారిపై జాతరలా సాగిన విజయోత్సవ యాత్ర.మన న్యూస్, సర్వేపల్లి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా మంగళవారం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తెలుగుదేశం కార్యకర్తలు ,అభిమానులు ,రైతులు నాయకులు సంతోషంతో పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఊహించని స్థాయిలో స్థాయిలో జరగడం సంతోషంగా ఉంది అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.250 ట్రాక్టర్లు వస్తాయని భావించాను. 800 నుంచి 900 ట్రాక్టర్లు రావడం ఆనందదాయకం అని అన్నారు.ప్రతి గ్రామం నుంచి రైతు రథాలు తరలిరావడంతో విజయోత్సవ ర్యాలీ సూపర్ సక్సెస్ అయింది అని తెలిపారు.పీఎం కిసాన్ పథకంతో కేంద్రం రైతులకు రూ.6 వేలు ఇస్తుంటే, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు మరో రూ.14 వేలు కలిపి అందిస్తున్నారు అని అన్నారు.వైసీపీ ప్రభుత్వంలో రూ.7500 కలిపి రూ.13,500 వేలు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.20 వేలకు పెంచింది అని అన్నారు.అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల సంతోషం రెట్టింపయింది అని అన్నారు.అన్నదాతల్లో ఆనందం నింపే ఈ పథకం కోసం రాష్ట్రంలో రూ.9300 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది అని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ శాఖకు పూర్వవైభవం వస్తోంది..నామరూపాలు కోల్పోయిన వ్యవసాయ శాఖ తిరిగి కొత్తకళను సంతరించుకుంది అని అన్నారు.తల్లికి వందనం పథకంతోనూ ప్రతి ఇంటా ఆనందమే,గత ప్రభుత్వం ఇంటికి ఒక్క బిడ్డకే అమ్మఒడి ఇస్తే, మా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ లబ్ధి చేకూరుస్తోంది అని తెలియజేశారు.ఆడపడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అమలు చేస్తున్న స్ర్తీశక్తి పథకానికి విశేష స్పందన లభిస్తోంది అని అన్నారు.కేవలం నాలుగు రోజుల్లో 19 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు అని అన్నారు.స్త్రీశక్తి పథకంతో రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి రూ.1800 కోట్ల మేర లబ్ధి జరుగుతుంది అని అన్నారు.దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నాం అని తెలియజేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఒక్క బ్లూమీడియాకు మాత్రమే కనిపించడం లేదు అని అన్నారు.వాస్తవాలకు దూరంగా ప్రతి అంశాన్ని వక్రీకరించడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు.స్త్రీశక్తి పథకంపైనా అబద్ధాలను వండి వారుస్తున్నారు....పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో అదనంగా కల్పించిన ప్రయోజనాలను పట్టించుకోరు అని తెలియజేశారు.వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను మూత వేస్తే, మా కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తెస్తోంది అని అన్నారు.ఉద్యాన పంటల కోసం ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క మన జిల్లాలోనే రూ.9 కోట్లు ఖర్చు పెట్టింది అని అన్నారు.వ్యవసాయ యాంత్రీకరణ పథకం అన్నదాతకు వరంగా మారింది. రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు, రొటావేటర్లు, గ్రాస్ కట్టర్లు, డ్రోన్లు తదితర పరికరాలు అందజేస్తున్నాం అని అన్నారు.రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు సంబంధించి 24 గంటలకే నగదు జమ చేస్తున్నాం అని అన్నారు.వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను సైతం భ్రష్టుపట్టిస్తే కూటమి ప్రభుత్వం ఇఫ్పుడు పనులు చేసి చూపిస్తోంది అని తెలియజేశారు.సామాజిక పింఛన్ల పెంపులోనూ కూటమి ప్రభుత్వం దేశంలోనే ఒక కొత్త చరిత్ర సృష్టించింది అని తెలిపారు.ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛన్ అందజేస్తోంది అని తెలియజేశారు.పింఛన్ ను రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు పెంచేందుకు జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది. చంద్రబాబు నాయుడు ఐదు నిమిషాల్లో రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచేశారు అని తెలిపారు. తెలంగాణలో పింఛన్ రూ.2500 ఇస్తుండగా, బీహార్ లో రూ.1100 మాత్రమే ఇస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లోనూ రూ.1000, రూ.1500 లోపే అని అన్నారు.ఇవన్నీ చూశాకే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు అని అన్నారు.గతంలొ పెద్దిరెడ్డి ముఠా కుప్పంలో అరాచకం సృష్టించి కొన్ని స్థానిక సంస్థల స్థానాలు గెలుచుకుని చంద్రబాబు నాయుడు గురించి హేళనగా మాట్లాడారు అని అన్నారు.ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట్ట ఫలితం తర్వాత జగన్ రెడ్డి ముఖాన్ని చూడాలన్నా చూడలేకపోతున్నాం..అసెంబ్లీకి అయినా వస్తారనుకుంటే అక్కడా కనిపించకపోయా అని తెలిపారు.పురుషుల అందాలను వర్ణించే జగన్ రెడ్డికి రాష్ట్రం, ప్రజలు, భవిష్యత్తు ఆలోచనలే రావు అని అన్నారు.జగన్ రెడ్డికి తెలిసొందక్కటే..రోజుకు ఎంత..నెలకు ఎంత..ఏడాదికి ఎంత..ఐదేళ్లకు ఎంత అని అక్రమ ఆదాయం లెక్కించుకోవడమే అని తెలిపారు.కూటమి ప్రభుత్వంతో రాష్ట్రానికి మంచి రోజులొచ్చాయి..పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి, వ్యవసాయం, ఇరిగేషన్ తదితర అన్ని రంగాల్లో పురోభివృద్ధి కనిపిస్తోంది అని తెలియజేశారు.వైసీపీ పాలనలో రాష్ట్రానికి గ్రహణం పడితే ఇప్పుడు పోలవరం, అమరావతి రాష్ట్రాభివృద్ధికి ఐకాన్ గా నిలుస్తున్నాయి అని తెలియజేశారు.