మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ విఆర్ ఒగా అవార్డు పొందిన అవసరాల కిషోర్ ను ఏలేశ్వరం ప్రకృతి పరిరక్షణ సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్. విజయబాబు మాట్లాడుతూ విఆర్ ఒగా కిషోర్ ఉత్తమ సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రకృతి పరిరక్షణ సంఘంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నార తెలిపారు. అలాగే ఇటీవల ఇటలీలో జరిగిన యువజన ఉత్సవాలకు రెండు రాష్ట్రాల తరఫున హాజరైన సిస్టర్ ప్రమీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు అనసూరి నాగేశ్వరరావు,కార్యదర్శి గోళ్ళ నాగేశ్వరావు, కోశాధికారి కోట శ్రీనివాస్ చక్రవర్తి, సహాయ కార్యదర్శి రైతు సహదేవుడు,తిరగటి సత్యనారాయణ,కోరాడ నారాయణరావు,కర్రోతు సత్యనారాయణ,వరుపుల చిట్టిబాబు,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత పాల్గొన్నారు.