మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం పట్టణంలో శ్రీ సాయి దుర్గ భవాని,విజయ దుర్గ భవాని,జై దుర్గ భవాని యూనియన్లు ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆటో కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. అనంతరం ఆటో కార్మికులు లింగవరం కాలనీ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆటో యూనియన్ల సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కూటమి ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నామని వాపోయారు.ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉన్నత చదువులు చదివి మా కాళ్ళపై మేము నిలబడాలని ఆటో ద్వారా జీవనంపాటి పొందుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వ పథకాలకు మేము వ్యతిరేకులము కాదని.ఇప్పటికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆటో కార్మికులకు కుటుంబాలు రోడ్డున పడకుండా న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కార్మిక వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కొప్పుల నాగభూషణం, జోగా సత్తిబాబు,కూసి వసంత కుమార్,నీలి నాగేశ్వరరావు,నడికట్ల వెంకన్న, తనకాల శ్రీను, గేసాల ప్రసాద్, పొన్నగంటి కృష్ణ,మాదేపల్లి దొరబాబు,తాతపూడి పెద్ద, దొండపాటి నాగేశ్వరరావు తదితర ఆటో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు