మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి పథకంలో భాగంగా మంజూరైన అదనపు తరగతుల యొక్క నిర్మాణం స్లాబ్ వరకు పూర్తి అయి అసంపూర్తిగా ఉండడంతో, 105 మంది విద్యార్థులు ఆరు బయట కూర్చొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అచ్చంపేట గ్రామానికి చెందిన నాయకులు మంద బలరాం, బంగ్లా ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల అవసరం దృష్ట్యా కనీసం 2 తరగతులు పూర్తి చేయడానికి రూ.4,00,000/- మంజూరు చేయడం జరిగింది. అలాగే రెండు తరగతి గదులను విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా నాణ్యతతో వేగంగా నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి రాజు ను ఆదేశించారు. నిధులు మంజూరు చేసినందుకు అచ్చంపేట గ్రామస్తులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు