మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గం ప్రతినిధి ఆగస్ట్-19
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డిని *"పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్"* ఆహ్వానించారు. మంగళవారం విజయవాడ ఏపి సచివాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రికను అందించారు. ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు జరిగే శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం మంత్రికి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే మురళీమోహన్ అందజేయగా, ఆలయ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షుడు గంగారపు హరిబాబు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కో-ఆర్డినేటర్ గిరిధర్ బాబు, కాణిపాకం దేవస్థానం మాజీ చైర్మన్ మణి నాయుడు మరియు ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు పాల్గోన్నారు.