శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించాలని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో తొలి పావంచ (తొలి మెట్టు) దగ్గర కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రచారం కమిటీ వింగ్ అధ్యక్షులు సరమర్ల మధుబాబు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గణేశుల బాబ్జీ, అరిగెల దొర (న్యాయవాది )రాయి శ్రీనివాసరావు వార్డ్ మెంబర్ సింగంపల్లి రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగావైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రచారం కమిటీ వింగ్ అధ్యక్షులు సరమర్ల మధుబాబు మాట్లాడుతూ, ముద్రగడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు చేపట్టి అభివృద్ధికి తోడ్పడ్డారని, దానిలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడ్డారని, మెత్త ప్రాంత ప్రజలు దేవుడిగా భావిస్తారని అన్నారు. ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆ సత్య దేవున్ని వేడుకోవడం జరిగిందన్నారు.