ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని మర్యాదపూర్వంగా కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన న్యూస్ ,ఢిల్లీ/ నెల్లూరు:కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో ఇతర ఎంపీలతో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. అంతకుముందు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు జేపీ నడ్డా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూటమి ఎంపీలు ఈ సందర్భంగా రాధాకృష్ణతో భేటీ అయ్యారు.