కాణిపాకం ఆగస్ట్ 18 మన న్యూస్
కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 2025 సంవత్సరం ఆహ్వాన పత్రికలను మరియు బుక్లెట్లను విజయవాడ లోని సచివాలయం నందు ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆవిష్కరించడం జరిగింది, శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలను శేషవస్త్రాన్ని చిత్రపటాన్ని అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ , మరియు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ , అందజేయడం జరిగింది, ముఖ్యమంత్రివర్యులు దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు పూజలు, తదితర అంశాలపై ఎమ్మెల్యే, కమీషనర్ గారితో చర్చించారు, ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ ధనుంజయ, దేవస్థానం మాజీ చైర్మన్ మణి నాయుడు, ఐరాల జడ్పిటిసి సుచిత్ర, అర్చకులు, వేద పండితులు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.