మన న్యూస్ తవణంపల్లె ఆగస్ట్-18
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం తవణంపల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ గా పదవి బాద్యతలు స్వీకరించిన అమరేంద్ర నాయుడు డైరెక్టర్ గా సిద్ధగుప్పుల భూపతి నాయుడు, సి మునేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం పాటుపడతామని తెలిపారు గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసింది.
తవణంపల్లి బ్రాహ్మణపల్లి ద్వారకాపురం లలో కనీసం కార్యాలయాలు కూడా లేవు రైతులకు ఎరువులు వేరుశనగలు యూరియా సకాలంలో అందించి వారికి తోడ్పాటు ఇచ్చిరైతు సంక్షేమ మే ధ్యేయంగా పనిచేస్తాము అని తెలిపారు. ఈరోజు బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ మరియు డైరెక్టర్లకు
కారకంపల్లి లోకనాథ నాయుడు, మహదేవ నాయుడు, పాపుదేసి చిన్న,
మారేడుపల్లి రెడ్డప్పనాయుడు, బంగారుపాల్యం వ్యవసాయ కమిటీ డైరెక్టర్ గురజాల జగదీష్, పుణ్యసముద్రం జ్యోతి, పార్థసారథి, తిరుకుమార్,
రామకృష్ణాపురం ప్రభాకర్ నాయుడు కంపలపల్లి బూత్ కమిటీ అధ్యక్షులు
చింతగుప్పల రజిని కుమార్, రాష్ట్ర తెలుగు యువత, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఆర్ శరవణ కుమార్ పార్టీ నాయకులు కార్యకర్తలు డిసిసిబి బ్యాంకు అధికారులు వారిని సన్మానించారు.