మన న్యూస్: దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య మూడో వర్ధంతి డిసెంబర్ 4,2024 న హైదరాబాదులోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫెడరేషన్ ఆఫ్ అవొపాస్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు,రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,జిఎంఆర్ గ్రూప్ చైర్ పర్సన్ గ్రంధి మల్లికార్జున రావు,పలువురు మంత్రులు రాజకీయ నేతలు హాజరవుతున్నారన లకిడికపూల్ లోని క్యాబ్సి భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా కోఆర్డినేటర్ కౌటికె విఠల్ తెలియజేశారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు హాజరై ఆ మహానీయునికి ఘన నివాళులర్పించి,కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నామని తెలిపారు.