మన న్యూస్,*నిజాంసాగర్*,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి మధ్యాహ్నం 3 గంటలకు 50,500 క్యూసెక్కుల భారీగా వరద వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.ఆదివారం మధ్యాహ్నం పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను 1400.90 అడుగుల నీరు నిలువ ఉంది. 17.802 టీఎంసీలు గాను 12.353 టీఎంసీల నీరు నిల్వ నిలువ ఉందన్నారు. ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీగా వరదనీరు వస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో ఏ క్షణంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లను వదిలే అవకాశం ఉందని ప్రజలు గమనించాలని సూచించారు.
సింగూరు ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా నీటి విడుదల ఎగువ భాగం నుంచి సింగూరు ప్రాజెక్టుకు 32766 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ప్రాజెక్టులు చేరుతుంది.దీంతోసింగూర్ ప్రాజెక్టు గత రెండు రోజుల నుంచి 5 వరద గేట్ల ద్వారా 43634 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్ల కు గాను ప్రస్తుతం 521.790 మీటర్ల నీరు నిల్వ ఉందన్నారు.29.917 టీఎంసీలకు గాను ప్రస్తుతం 20.910 పిఎంసిల నీరు నిల్వ ఉందన్నారు.