మన న్యూస్,సంగారెడ్డి జిల్లా,ఆగస్టు 17 , సింగూరు ప్రధాన కాల్వకు వెంటనే మరమత్తులు చేయాలని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.ఆదివారం ఉదయం ప్రాజెక్టు లోని పుల్కల్ మండలం ఇసోజు పేట గ్రామంలో రాజనర్సింహ ప్రధాన కాల్వ కు గండి పడిన విషయమై పర్యటించారు.ఈ సందర్భంగా సింగూరు ప్రధాన కాల్వకు వెంటనే పటిష్ట మరమత్తులు చేయాలని జిల్లా కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ , రెవిన్యూ,పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు పాల్గొనారు.