మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ ప్రాజెక్టులోని ఎగువ భాగంలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరని వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 35,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1398.66 అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు. నీటి ప్రవాహాల వైపు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదన్నారు.