మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టులోకి రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణం వరద నీరు రిజర్వాయర్ లోకి వచ్చి చేరుకుంటుందని నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. వారు సింగీతం రిజర్వాయర్ నీటిమట్టం 416. 550మీ టర్లు కాగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వా యర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన వర్ని మండలం బడపహాడ్ ,గండివేట్,వెల్లుట్ల, పరిధిలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగడంతో ప్రాజెక్టులో 415.90 0మీటర్లు స్థాయి నీటిమట్టానికి చేరుకుందని అయితే సంగీతం రిజర్వాయర్ పరిధిలోని నర్వ శివారులో తూము వద్ద బుంగపడడంతో ఇసుక బస్తాలను వేసి నీటి వృథాను అరికట్టారు.అయితే సింగీతం రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్న నీటిని అదే స్థాయిలో దిగువన మొత్తంలో 1000 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్షాభావంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు, రైతులు నీటి ప్రవాహంలోకి, కాలువలలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు.