ఉదయగిరి ఆగస్టు 16 మన న్యూస్ ప్రతినిధి :///
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లోని దుత్తలూరు మండలం వరికుంటపాడు మండలం ఉదయగిరి మండలంలో ఎనీ టైం మందు బెల్టు దుకాణాలలో పలు కాలనీలలో పల్లెల్లో గ్రామీన ప్రాంతాలు అన్నిటిలో మద్యం మందుబాబులకు చేరువైంది కొన్ని గ్రామాలలో డోర్ డెలివరీ సౌకర్యాలను కూడా వ్యాపారులు అమలు చేస్తున్నారన్న సమాచారం బెల్ట్ షాపులలో 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి దుత్తలూరు మండలం భైరవరం గ్రామంలో బహిరంగంగా బెల్ట్ షాపులు పెట్టి మమ్మల్ని అడిగేది ఎవరు ఆపేదెవరు అన్నట్లుగా దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పువన్న నియమ నిబంధనను తుంగలో తొక్కి ఎక్స్చేంజ్ అధికారుల అండదండలతో ధైర్యంగా పట్టపగలే సిట్టింగ్ వేసి పబ్లిక్ గా మద్యం సేవిస్తూ ఉండడం గమనార్హం ఎక్స్చేంజ్ అధికారులు మేము దాడి చేశాం మాకు అక్కడేమీ దొరకలేదని చెబుతున్నారు మేము వెళ్లే లోపు వారికి ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని అందుకే వాళ్లు మాకు దొరకడం లేదని ఎక్స్చేంజ్ అధికారులు చెప్పడం హాస్యాస్పదం మందుబాబులు తెల్లవారుజాము నుంచే బైరవరం బెల్ట్ షాపు వద్ద బహిరంగంగానే మద్యం తాగుతున్నారు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు గానీ పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు బెల్ట్ షాపులు ద్వారా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి అమ్మేవారు కూడా తాము అధికారులను ప్రసన్నం చేసుకొనే విక్రయాలు జరుపుకుంటున్నామని చెప్పడం విశేషం టెండర్లను దక్కించుకునేందుకు వ్యాపారులు సిండికేట్లుగా మారిన విషయం తెలిసిందే ఎమ్మార్పీ రేటు కంటే ఎక్కువగా అమ్మితే అదనపు ఆదాయం వస్తుందని వ్యాపారులు ప్రతి మద్యం సీసాపై పది రూపాయల నుండి 50 రూపాయలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి మద్యం వ్యాపారులు కిరాణా దుకాణాల వ్యాపారుల ఇళ్లకు వెళ్లి దర్జాగా అమ్మకాలు చేసుకోవచ్చు అని చెప్పడం విశేషం దీంతో గుడి బడి అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి కొంతమందికి తెలిసినవారు ఉండడంతో వారికి ముందస్తు డబ్బులు చెల్లించకుండానే మద్యం సీసాలను సరఫరా చేస్తున్న వైన్ షాపులో లైసెన్స్ దారులు మద్యం సీసాలను అమ్మిన తరువాతే డబ్బులు తీసుకుంటామన్న వెసులుబాటు కలిపిస్తున్నారు ఇందులో అత్యధిక ధర ఇచ్చే వారికి బెల్ట్ షాపుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆయా ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు . బెల్ట్ షాపులు యదేచ్చగా నడుస్తున్న మొక్కుబడి కేసులతో ఎక్సేంజ్ అధికారులు సర్థిది పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి దాడుల్లో పట్టుబడ్డ మద్యం ఏ షాపు నుంచి వచ్చిందో మూలాలు కనుక్కొని వాటిపై చర్యలు తీసుకోవడం లేదు అని ప్రజలు మండిపడుతున్నారు