మన న్యూస్: కృష్ణాపురం జలాశయాన్ని కుడి ఎడమ కాలువలతో పాటు జలాశయాన్ని అభివృద్ధి చేస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పెంగల్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు ఆదివారం కార్వేటి నగరం మండలం ఏ పిల్ చెరువు, అమ్మగారి చెరువు పరిశీలించి జల హారతి ని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కృష్ణాపురం జలాశయం పెద్ద జలాశయము మన నియోజకవర్గంలో ఉండడం ఎంతో గర్వంగా ఉంది కృష్ణాపురం జలాశయం నీరు నిండితే సుమారు 6500 ఎకరాలకు ఆయకట్టు భూములు సాగులోకి వస్తాయి ఫెంగల్ తుఫాన్ వర్షానికి ఇప్పటివరకు నాలుగు చెరువులు నీరు నిండాయి ఇంకా మూడు చెరువుల నీరు నిండవలసి ఉన్నది అది కూడా రాత్రికి వర్షం కురిస్తే అన్ని చెరువులో నీరు నిండి పుష్కలంగా మొరవలు పోతాయి కృష్ణాపురం జలాశయాన్ని కుడి ఎడమల కాలువలతో పాటు జలాశయాన్ని మరింత అభివృద్ధి చేస్తాను రైతులకు ఎల్లప్పుడూ ముందుంటాను అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రైతులు కి హామీ ఇచ్చారు ఫెంగాల్ తుపాన్ పట్ల గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అత్యవసరమైతే నే బయటకు రండి..అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు ఈ కార్యక్రమంలో కార్వేటి నగర్ మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుండయ్య బిగాల రమేష్ అడ్వకేట్ రాము మాజీ సర్పంచ్ కుప్పయ్య మాజీ ఎంపీపీ జనార్దన్ రాజు మురళి, రైతు నాయకుడు నాగేశ్వరరాజు ,మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, టిడిపి యువ నాయకులు రాజా సిఐ హనుమంతప్ప ఎస్సై రాజ్ కుమార్ ఇరిగేషన్ ఏఈ భాస్కర్ రాజు, ఎమ్మెల్యే సలహాదారులు చంద్రశేఖర్, లోకేష్, అనిల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు