మన న్యూస్, నిజాంసాగర్:
ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల కళ్యాణి ప్రాజెక్టుకు వరద నీరు 800 క్యూసెక్కులు చేరుతుండటంతో, ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తివేసి 700 క్యూసెక్కుల నీటిని దిగువ మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.అదనంగా 100 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి మళ్లించారు అని ఆయన పేర్కొన్నారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 408.50 మీటర్ల వద్ద ఉందని వెల్లడించారు.ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవరు కూడా ప్రాజెక్టు సమీపానికి వెళ్లకూడదని, భద్రతా చర్యల కోసం దూరంగా ఉండాలని సూచించారు.